అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: అంజలి కుటుంబానికి జగన్ హామీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-02 13:20:59  IST  )

రాజమండ్రిలో ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన ఫార్మసీ విద్యార్థినికి కుటుంబానికి అండగా ఉంటామని మాజీ సీఎం జగన్ హామీ ఇచ్చారు.

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: అంజలి కుటుంబానికి జగన్ హామీ
X

దిశ, వెబ్ డెస్క్: రాజమహేంద్రవరం(Rajamahendravaram)లో ఫార్మసీ విద్యార్ధిని అంజలి(Pharmacy Student Anjali) ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) బాధిత కుటుంబం కలిసింది. తనకు కూతురుకు జరిగిన అన్యాయాన్ని జగన్‌కు వివరించింది. తమ కుమార్తె ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కన్నీటి పర్యంతమైంది. దీంతో అంజలి కుటుంబానికి జగన్ ధైర్యం చెప్పారు. న్యాయం జ‌రిగే వ‌ర‌కూ పూర్తిగా అండ‌గా ఉంటామని హామీ ఇచ్చారు. అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందిస్తామని జగన్ పేర్కొన్నారు.

Next Story