- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ప్రభుత్వం వారిని ఆదుకోవాలి’.. మాజీ సీఎం జగన్ డిమాండ్
అన్నమయ్య జిల్లాలో నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: అన్నమయ్య జిల్లాలో నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తా పడింది. వ్యవసాయ కూలీలతో వెళుతున్న లారీ బోల్తా పడడంతో ఏడుగురు స్పాట్‌లోనే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో మృతుల సంఖ్య ఈ రోజు ఉదయానికి తొమ్మిదికి చేరింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది వ్యవసాయ కూలీలు మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని వైఎస్ జగన్ కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.






