- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే భాను ప్రకాశ్‌ను అరెస్ట్ చేయాలి: మాజీ సీఎం జగన్ డిమాండ్
ఎమ్మెల్యే భాను ప్రకాశ్‌ను అరెస్ట్ చేయాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ చేశారు..

దిశ, వెబ్ డెస్క్: చెన్నైలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో మాజీ మంత్రి రోజా(Former Minister Roja), నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్(Nagari MLA Gali Bhanu Prakash) మధ్య మాటలు చెలరేగిన విషయం తెలిసిందే. రోజా, భాను ప్రకాశ్ ఇద్దరూ ఏ మాత్రం తగ్గకుండా పరస్పరం ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు. అయితే గాలి భాను ప్రకాశ్ చేసిన వ్యాఖ్యలపై రోజా కంటతడిపెట్టుకున్నారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్(Former CM Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే భాను ప్రకాశ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రోజాపై గాలి భానుప్రకాశ్ వ్యాఖ్యలు అత్యంత హేయం. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగానూ పని చేసిన రోజాను అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. మహిళల గొంతు నొక్కడమే ధ్యేయంగా జరిగింది.’’ అని జగన్ ట్వీట్ చేశారు.
‘‘వ్యక్తిత్వ హననం ద్వారానే చంద్రబాబునాయుడు తన రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఒక మహిళపై అత్యంత హేయంగా ఆరోపణలు చేసి, దుష్ప్రచారం చేసే ఆయన ఉన్నత పదవి పొందారు. అప్పటి నుంచే వ్యక్తిగత దాడులు, స్త్రీలను ద్వేషించే తత్వం టీడీపీకి ఒక బ్రాండ్‌గా మారింది.’’ అని జగన్ మండిపడ్డారు.






