- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్మీ జవాన్ మృతి పై మాజీ సీఎం జగన్ సంతాపం
ఆర్మీ జవాన్ కార్తీక్ మృతి పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Former CM YS Jagan) సంతాపం తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆర్మీ జవాన్ కార్తీక్ మృతి పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Former CM YS Jagan) సంతాపం తెలిపారు. ఉత్తర జమ్మూలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో కార్తీక్(Karthik) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ ఘటన పై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. జమ్మూకాశ్మీర్(Jammu Kasmir)లోని సొపోర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో చిత్తూరు జిల్లా, ఎగువరాగిమాను పెంట గ్రామానికి చెందిన కార్తిక్ వీర మరణం పొందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కార్తీక్ చూపిన ధైర్య సాహసాలు, త్యాగానికి సెల్యూట్ అని ప్రశంసించారు. ఈ కష్ట సమయాల్లో కార్తీక్ కుటుంబానికి అండగా నిలుద్దాం అని ఆయన తెలిపారు. ఈ క్రమంలో కార్తీక్ ఆత్మకు శాంతి చేకూరాలని, కార్తిక్ కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నా అంటూ మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు.






