YS Jagan:వైఎస్ రాజారెడ్డి ఘాట్ వద్ద నివాళికి మాజీ సీఎం జగన్ దూరం?

by Jakkula.Mamatha |

వైఎస్ రాజారెడ్డి శతజయంతి సందర్భంగా ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత ఆసక్తికర ట్వీట్ చేశారు.

YS Jagan:వైఎస్ రాజారెడ్డి ఘాట్ వద్ద నివాళికి మాజీ సీఎం జగన్ దూరం?
X

దిశ,వెబ్‌డెస్క్: వైఎస్ రాజారెడ్డి శతజయంతి సందర్భంగా ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత ఆసక్తికర ట్వీట్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి 100వ జయంతి సందర్భంగా పులివెందులలోని డిగ్రీ కాలేజ్ రోడ్డు సమీపంలో ఉన్న రాజారెడ్డి ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు ఘన నివాళి అర్పించారు. అయితే.. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల తదితరులు పాల్గొన్నారు. అనంతరం CSI చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, రాజారెడ్డి శతజయంతి కేక్ కట్ చేశారు.

ఇదిలా ఉంటే.. తాత రాజారెడ్డి(YS Raja Reddy) ఘాట్ వద్ద నివాళి కార్యక్రమానికి మాజీ సీఎం జగన్ దూరంగా ఉన్నారు. వైఎస్ రాజారెడ్డి శతజయంతిని విజయవాడ(Vijayawada)లోని నిర్మల శిశు భవన్ లో తన భార్య భారతితో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారితో పాటు జగన్ మేనత్త విమలా రెడ్డి కూడా ఉన్నారు. పిల్లలతో కలిసి వీరు కేక్ కట్ చేశారు. ‘నా దివంగత తాతగారి 100వ జ్ఞాపకార్థ వార్షికోత్సవాన్ని గౌరవిస్తున్నాను’.. ఈ మేరకు వైఎస్ జగన్(Former CM YS Jagan) ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Next Story