ఉద్రిక్తంగా మారుతోన్న AP ఎలక్షన్స్.. పోలీసులపై మాజీ సీఎం చంద్రబాబు ఫైర్

by Disha Web Desk 19 |
ఉద్రిక్తంగా మారుతోన్న AP ఎలక్షన్స్.. పోలీసులపై మాజీ సీఎం చంద్రబాబు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. పలుచోట్ల అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జమ్మలమడుగు, తాడిపత్రి, రెంటాలతో పాటు పలు చోట్ల ఇరు పార్టీ నేతలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఎన్నికల్లో ఘర్షణలు చోటు చేసుకోవడంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని బాబు ఫైర్ అయ్యారు. ఉదయం నుండి చోటు చేసుకుంటున్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా శాంతిభద్రతలను కాపాడలేకపోయారని పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఎన్నికల సంఘం వెంటనే పోలింగ్ ప్రక్రియను సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది.

Next Story

Most Viewed