- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవర్నర్‌తో జగన్ భేటీ.. కోటి సంతకాల ప్రతుల అందజేత
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కలిశారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్(AP Governor Abdul Nazeer)ను మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(YSRCP chief Jagan Mohan Reddy) కలిశారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకంగా సేకరించిన సంతకాల ప్రతులను గవర్నర్‌కు అందజేశారు. గుంటూరు తాడేపల్లి నుంచి విజయవాడ లోక్ భవన్(Vijayawada Lok Bhavan)కు వెళ్లిన జగన్.. గవర్నర్‌ను కలిసి చర్చించారు. మెడికల్ కాలేజీలపై విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే నష్టాలను వివరించారు. జగన్‌తో పాటు మరో 40 మంది వైసీపీ ముఖ్య నేతలు సైతం కలిశారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందని, ఎట్టిపరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదని గవర్నర్‌కు వివరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల్లో కోటి మంది ప్రజలు సంతకాలు చేశారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.






