- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సొంత జిల్లాలో జగన్‌కు బిగ్ షాక్.. మైదుకూరు మున్సిపల్ చైర్మన్ గుడ్ బై
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి సొంత జిల్లాలో బిగ్ షాక్ తగిలింది...

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy)కి సొంత జిల్లాలో బిగ్ షాక్ తగిలింది. కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర(Maiduguri Municipal Chairman Chandra) గుడ్ బై చెప్పారు. కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)కి దూరంగా ఉంటున్న ఆయన తాజాగా రాజీనామా చేశారు. పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వం నుంచి సైతం తప్పుకున్నారు. పార్టీ అధ్యక్షుడితో కలిసి మాట్లాడాలని చంద్ర ప్రయత్నం చేస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే సహకరించకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. అనుచరులు, బంధువుల అభిప్రాయం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గురువారం రాజీనామా చేసి లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపారు. త్వరలోనే భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. టీడీపీ లేదా జనసేనల్లో చేరే అవకాశం ఉందని అనుచరులు అంటున్నారు.
అయితే మైదుకురుకు చెందిన కౌన్సిలర్ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. జగన్ సొంత జిల్లాలోనూ ఆ పార్టీకి నాయకుల ఆదరణ కరువు అవుతోంది. గత ఎన్నికల్లో జగన్ కు సైతం మెజార్టీ తగ్గింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కడప జిల్లాలో పార్టీ బలహీనం అయినట్లు జగన్‌కు ఇప్పటికే పార్టీ వర్గాలు తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించారు. అయినా సొంత జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బిగ్ షాక్ తగలడం చర్చనీయాంశంగా మారింది.






