- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైఎస్ జగన్‌కు బిగ్ షాక్.. ఆ భూములు రద్దు
విశాఖ రామానాయుడు స్టూడియోలోని నివాస స్థలాల విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది..

దిశ, వెబ్ డెస్క్: విశాఖ రామానాయుడు స్టూడియో(Visakha Ramanaidu Studio)లోని నివాస స్థలాల విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Former Chief Minister YS Jagan Mohan Reddy)కి బిగ్ షాక్ తగిలింది. స్టూడియోలోని 15.17 ఎకరాల భూములను వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో నివాస స్థలాలకు ఇచ్చారు. అయితే ఆ స్థలాలు స్టూడియో అవసరాలకు కాకుండా ఇళ్ల లేఅవుట్లకు వినియోగించడంపై స్థానిక ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సుప్రీంకోర్టులోనూ ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ఆ భూములపై నివేదిక అందుకున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 15.17 ఎకరాల భూములను రద్దు చేసింది. నిర్దేశించిన ప్రయోజనం కోసం ఇచ్చిన భూమిని వినియోగించనందుకు రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా(Revenue Department Special Chief Secretary RP Sisodia) ఉత్తర్వులు జారీ చేశారు. రామానాయుడు స్టూడియోకు షోకాజు నోటీసు ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
కాగా 2010లో స్టూడియో నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం విశాఖలో 34.44 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే జగన్ ప్రభుత్వం హయాంలో 15.17 ఎకరాలను ఇళ్ల లేఅవుట్ వేసేందుకు అనుమతించింది. దీంతో సుప్రీంకోర్టుకు ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణ వెళ్లారు. జగన్ ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. జనసేన నేత మూర్తి యాదవ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. స్డూడియో నిర్మాణం కోసం ఇచ్చిన భూమిని ఇళ్ల స్థలాల మార్పునకు అనుమతివ్వొద్దని ప్రభుత్వాన్ని కోరారు.






