- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. ఈ రోజు: వైఎస్ జగన్ ట్వీట్
ప్రజలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: ప్రజలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. ఈ రోజు.. ‘ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజని, .. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజని.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు’ అని పేర్కొన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా తాను నివాళులర్పిస్తున్నానని జగన్ ట్వీట్ చేశారు.
కాగా రాష్ట్రంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాసేపట్లో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించనునున్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ ఎర్రకోటలో ప్రధాని మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.






