- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోగి రమేశ్ ఇంటిపై దాడి.. స్పందించిన జగన్
మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై దాడిని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఖండించారు....

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఇబ్రంహీంపట్నం(Vijayawada Ibrahimpatnam)లో మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh) ఇంటిపై టీడీపీ(Tdp) శ్రేణులు దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులపై వైసీపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Ycp Former Cm Jagan Mohan Reddy) స్పందించారు. జోగి రమేశ్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. అలాగే జోగి రమేశ్ ఇంటిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంకు హింసకు తావులేదని, ప్రశ్నిస్తే భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో హిసాజ్వాలను రాజేస్తున్నారని మండిపడ్డారు. ఆ మంటలే కూటమి ప్రభుత్వాన్ని దహించి వేస్తాయని హెచ్చరించారు. జోగి రమేశ్‌కు పార్టీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు.
ప్రశ్నించినందుకే అంబటి, జోగి రమేశ్ ఇంటికి నిప్పు
‘‘ప్రభుత్వ తప్పులను ప్రశ్నించినందుకే అంబటి, జోగి రమేశ్ ఇంటికి నిప్పుపెట్టారు. మీ ప్రభుత్వానికి మీరే నిప్పు పెట్టుకుంటున్నారు. వైసీపీ ప్రశ్నలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇళ్లకు నిప్పుపెట్టడానికి జంగిల్ రాజ్‌కు ప్రతీక. ప్రజాగ్రహ జ్వాలలు కూటమి ప్రభుత్వాన్ని దహనం చేస్తాయి. ఆటవిక, అరాచక పాలన అంతంకాకతప్పదు.కూటమి ప్రభుత్వం సృష్టించిన జంగిల్ రాజ్ భూస్థాపితం కాక తప్పదు. ఇది చరిత్ర చెప్పే సత్యం.’’ అని జగన్ వ్యాఖ్యానించారు.






