- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OMC Case: అప్పుడే అయిపోలేదు.. త్వరలో ED ఎంట్రీ ఉంటుంది.. కోర్టు తీర్పుపై స్పందించిన CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ
ఓబుళాపురం మైనింగ్ కేసు(Obulapuram Illegal Mining Case)లో తుది తీర్పు వచ్చేసింది. 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఐదుగురిని దోషులుగా తేలుస్తూ సీబీఐ కోర్టు(CBI Court) తీర్పు వెలువరించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఓబుళాపురం మైనింగ్ కేసు(Obulapuram Illegal Mining Case)లో తుది తీర్పు వచ్చేసింది. 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఐదుగురిని దోషులుగా తేలుస్తూ సీబీఐ కోర్టు(CBI Court) తీర్పు వెలువరించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్, వీడీ రాజగోపాల్, అలీఖాన్‌లను దోషులుగా నిర్ధారించింది. వీరందరికీ రూ.10 వేల జరిమానాతో పాటు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ IAS అధికారి కృపానందంను నిర్దోషులుగా తేల్చింది. తాజాగా కోర్టు తీర్పుపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(Former CBI JD Lakshminarayana) స్పందించారు.
‘మైనింగ్ లీజు ఇవ్వడానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఈ కేసులో మొదటి నుంచి పక్షపాతం కనిపించింది. జరిగిన అక్రమాలను నిరూపించేందుకు చాలా ఇబ్బందులు పడ్డాం. ఆధారాలు సంపాదించడం సవాళ్లతో కూడుకున్న పని. అన్ని ఆధారాలు ఉన్నా గాలి జనార్ధన్ రెడ్డి అరెస్ట్ సమయంలో చాలా గోప్యతగా ఉండాల్సి వచ్చింది. ఐటీ అధికారులు మారు వేశంలో వెళ్లి గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఓబుళాపురంలో రూ.840 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా తరలించారు. విషయం తెలుసుకొని తాము రంగంలోకి దిగేటప్పటికే అక్రమ రవాణా మొత్తం పూర్తయింది. తామంతా జరిగిన అక్రమాలను నిరూపించాల్సి వచ్చింది. ఖనిజం తవ్వాలపై అమెరికా నుంచి మ్యాపులు సాధించాం. అక్రమార్కులకు శిక్ష పడితే మిగతా వారిలో భయం కలుగుతుంది. శిక్షలు పడకపోతే భూగర్భ సంపదను విచ్చలవిడిగా దోచే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ఘటనలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. త్వరగా శిక్ష పడేలా చూడాలి. విచారణ సుదీర్ఘంగా సాగితే అనేక మార్పులు వస్తాయి. నిందితులు మాట మార్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ కేసు అప్పుడే ముగియలేదు.. త్వరలో ఈడీ దర్యాప్తు కూడా కొనసాగవచ్చు. సీబీఐ కోర్టు తీర్పుపై కొందరు హైకోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఫైనల్ కోర్టు తీర్పు తనకు సంతృప్తిని ఇచ్చింది.’ అని లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.






