- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రగిరిలో హైడ్రామా.. మాజీ ఆర్మీ ఉద్యోగి పై కర్రలతో దాడి
చంద్రగిరిలో మహిళకు అసభ్య మెసేజ్‌లు పంపాడనే ఆరోపణతో మాజీ ఆర్మీ ఉద్యోగి ఎల్లప్ప రెడ్డిపై బంధువులు కర్రలతో దాడి చేశారు. ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి సమీపంలోని చంద్రగిరిలో హైడ్రామా నెలకొంది. ఓ మహిళకు ఓ వ్యక్తి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నాడని కోపంతో బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఆర్మీ ఉద్యోగిగా పనిచేసిన ఎల్లప్ప రెడ్డి గా గుర్తించిన మహిళ తరుపు కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రెడ్డి వీధిలో ఎల్లప్ప రెడ్డిని పట్టుకుని కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఎల్లప్ప రెడ్డి నేరుగా చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. మరోవైపు, మహిళకు అసభ్య మెసేజ్‌లు పంపి వేధించాడంటూ బాధిత మహిళ బంధువులు కూడా ఎల్లప్ప రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఎల్లప్ప రెడ్డిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.






