YS Jagan:తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ మాజీ సీఎం కీలక విజ్ఞప్తి

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-18 09:46:47  IST  )

హైదరాబాద్(Hyderabad)​ నగరంలోని చార్మినార్​ పరిధిలో గుల్జార్​ హౌస్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

YS Jagan:తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ మాజీ సీఎం కీలక విజ్ఞప్తి
X

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad)​ నగరంలోని చార్మినార్​ పరిధిలో ఈ రోజు(ఆదివారం) తెల్లవారుజామున గుల్జార్​ హౌస్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన పై ఏపీ మాజీ సీఎం జగన్(Former CM YS jagan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని చార్మినార్ సమీపంలో గుల్జార్ భవన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఇటువంటి దుర్ఘటన చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ(Telangana), ఏపీ(Andhra Pradesh) సీఎంలు, ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

Next Story