బెంగళూరు వెళ్తుండగా జగన్ హెలికాప్టర్‌కు ఆటంకం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-27 10:43:06  IST  )

ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్‌కు ఈ రోజు ఉదయం కొంతసేపు ఆటంకం కలిగింది....

బెంగళూరు వెళ్తుండగా జగన్ హెలికాప్టర్‌కు ఆటంకం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former AP CM Jagan Mohan Reddy) హెలికాప్టర్‌(Helicopter)కు ఈ రోజు ఉదయం కొంతసేపు ఆటంకం కలిగింది. రెండు రోజులు పాటు ఆయన పులివెందుల(Pulivendula)లో పర్యటించారు. పర్యటన ముగియడంతో ఈ రోజు ఉదయం బెంగళూరు(Bengaluru) వెళ్లేందుకు హెలికాప్టర్‌లో ఆయన పులివెందుల నుంచి బయల్దేరారు. అయితే కొంతదూరం వెళ్లిన తర్వాత మార్గమంతా పొంగ మంచుతో నిండిపోయింది. దీంతో అప్రమత్తమైన పైలట్ తిరిగి పులివెందులకు హెలికాప్టర్ తీసుకొచ్చారు. అనంతరం వాతావరణం అనుకూలించడంతో హెలికాప్టర్‌లో జగన్‌ బెంగళూరు వెళ్లిపోయారు.

జగన్ ఓటమి తర్వాత జగన్ నివాసం బెంగళూరుకు వచ్చారు. పార్టీ కార్యక్రమాలు ఉన్న సమయంలో ఆయన ఏపీకి వస్తున్నారు. అనంతరం వెళ్లిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ లోటస్ పాండ్‌కు సైతం వెళ్లారు. ఆస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన ఆయన ఆ తర్వాత జూబ్లీహిల్స్ లోటస్ పాండ్‌ నివాసానికి వెళ్లారు. చాలా రోజుల తర్వాత ఆయన హైదరాబాద్ రావడంతో వైసీపీ శ్రేణులు భారీగా కలిశారు.

Next Story