సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‍కి బిగ్ షాక్.. హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-31 08:24:15  IST  )

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది....

సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‍కి బిగ్ షాక్.. హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌(Former AP CID chief Sanjay)కు సుప్రీంకోర్టు(Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టు(AP High Court) ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సుప్రీం ధర్మాసనం రద్దు చేసింది. అలాగే సంజయ్‌ను 21 రోజుల్లోగా సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది.

కాగా గత ప్రభుత్వం హయాంలో సీఐడీ చీఫ్‌గా సంజయ్ పని చేశారు. అయితే ఆయనపై అప్పట్లోనే పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంజయ్‌పై ఉన్న ఆరోపణలపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు దర్యాప్తు చేయించింది. అగ్నిమాపక విభాగం(Fire Department)లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో సంజయ్ నిందితుడిగా తేలింది. ఈ మేరకు ఆయనపై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

దీంతో అప్రమత్తమైన సంజయ్.. వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ కావాలని కోరారు. సంజయ్ అభ్యర్థనను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే సంజయ్‌కు ముందస్తు బెయిల్‌ ఇవ్వడంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. తాజాగా జరిగిన విచారణలో సంజయ్ ముందస్తు బెయిల్‌ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. సంజయ్‌ను కస్టడీకి తీసుకునేందుకు మేజిస్ట్రేట్ కోర్టులో దర్యాప్తు సంస్థ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. బెయిల్ కోసం నిందితుడు సంజయ్ సైతం కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు సూచించింది.

Next Story