- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ డ్రోన్:అలర్ట్ అయిన రక్షణ శాఖ
by Seetharam |
విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌లో డ్రోన్ కెమెరాలు ఒక్కసారిగా కలకలం రేపాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌లో డ్రోన్ కెమెరాలు ఒక్కసారిగా కలకలం రేపాయి. ఓ ప్రయాణికుడి దగ్గర నుంచి ఎయిర్ పోర్టు అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ డ్రోన్ కెమెరాలను పరిశీలించగా అవి విదేశాలకు చెందినవిగా స్పష్టం చేశారు. ప్రయాణికుడి వద్ద డ్రోన్ కెమెరాలతో పాటు బంగారం కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇకపోతే ఐఎన్‌ఎస్ డేగా విమానాశ్రయం కలిపి ఉండటంతో రక్షణ శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో రీ సర్ఫెసింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో డ్రోన్ కెమెరాలు, బంగారం పట్టుబడటంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇకపోతే ప్రయాణికుడు సింగపూర్ నుంచి వస్తున్న వ్యక్తిగా పోలీసులు చెప్తున్నారు. డ్రోన్ కెమెరాను ఎందుకు తీసుకువస్తున్నాడో అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story






