పరిశ్రమల కోసం.. ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో చర్చిస్తాం! మంత్రి లోకేష్

by Geesa Chandu |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ మరియు పరిశ్రమల స్థాపన కొరకు.. దేశంలోనే టాప్ 10 పారిశ్రామిక వేత్తలతో చర్చించనున్నట్లు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

పరిశ్రమల కోసం.. ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో చర్చిస్తాం! మంత్రి లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ మరియు పరిశ్రమల స్థాపన కొరకు.. దేశంలోనే టాప్ 10 పారిశ్రామిక వేత్తలతో చర్చించనున్నట్లు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆయన ఉండవల్లిలోని నివాసంలో అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. సమావేశంలో పెట్టుబడి దారులను ఆకర్షించడం, ఇంకా మౌలిక సదుపాయాల కల్పన పై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 'రియల్ టైమ్ పరిపాలన'ను మరింత మెరుగు పరిచేలా చూడాలని అన్నారు. ఇన్నోవేషన్స్ కు సంబంధించి స్టార్టప్ లకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించాలని కూడా ఈ సందర్భంగా మంత్రి అధికారులతో జరిగిన సమీక్షలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఐటీ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఏపీటీఎస్ ఎండీ రమణా రెడ్డి, ఐటీ జాయింట్ సెక్రటరీ సుర్జీత్ సింగ్ తో పాటు కమ్యూనికేషన్స్ డైరెక్టర్ వెంకటాచలం ఇంకా పలువురు అధికారులు పాల్గొన్నారు.

Next Story