- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TTD: భక్తులకు అలర్ట్.. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు ముగిసిన రిజిస్ట్రేషన్
భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అలర్ట్ ఇచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అలర్ట్ ఇచ్చింది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ముగిసింది. రిజిస్ట్రేషన్లను ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ప్రారంభించగా.. నేడు సాయంత్రం 5 గంటలకు పూర్తి అయ్యింది. మూడో రోజు ఆన్‌లైన్‌లో 9.95 లక్షల రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు టీటీడీ ఇవాళ (సోమవారం) ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు 24 లక్షల మంది భక్తులు మూడు రోజులకు రిజిస్టేషన్లు చేసుకున్నట్లు పేర్కొంది. రేపు (డిసెంబర్ 2) మధ్యాహ్నం 2 గంటలకు ఈ డిప్ విధానంలో దర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనం
డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి టీటీడీ అనుమతించనున్నది. ఇక జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనం యథాతథంగా కొనసాగనుంది. ఈ మేరకు 7 రోజులకు సంబంధంచి 300 దర్శనం టికెట్లు, రోజుకు వెయ్యి శ్రీవాణి టికెట్లు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి డిసెంబర్ 5వ తేదీన ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారు. చివరి మూడు రోజులు జనవరి 6, 7, 8 తేదీల్లో స్థానికుల కోసం రోజుకు 5వేల టోకన్లు ఇవ్వనున్నారు. వీటిని ఈ నెల 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు.






