- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి భోజనాల్లో ఫుడ్ పాయిజన్.. 28 మంది ఆస్పత్రి పాలు
కోనసీమ జిల్లా కొత్తపేట మండలం రామ్మోహన్ రావుపేటలో పెళ్లి విందు విషాదాన్ని నింపింది. వివాహ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన భోజనాలు తిన్న అతిథులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ..

దిశ, వెబ్ డెస్క్: కోనసీమ జిల్లా(Konaseema District) కొత్తపేట మండలం రామ్మోహన్ రావుపేట(RammohanRaopet)లో పెళ్లి విందు(Wedding Feast) విషాదాన్ని నింపింది. వివాహ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన భోజనాలు(Meals) తిన్న అతిథులు ఒక్కసారిగా అస్వస్థత(Illness)కు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో సుమారు 28 మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. బాధితుల్లో చిన్న పిల్లలు, మహిళలు కూడా ఉండటంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
బాధితులకు అత్యవసర చికిత్స
బాధితుల పరిస్థితిని గమనించిన బంధువులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే వైద్య సిబ్బంది రంగంలోకి దిగి బాధితులకు అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రాథమికంగా వెల్లడించారు. కలుషిత ఆహారం లేదా నీటి వల్ల ఈ సమస్య తలెత్తి ఉంటుందని అనుమానిస్తున్నారు.
మెరుగైన వైద్య సేవలకు మంత్రి ఆదేశం
ఈ ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెంటనే స్పందించారు. అధికారులతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైతే స్పెషలిస్ట్ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స చేయించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.






