- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Airport: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగమంచు
విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. విజిబిలిటీ (దృశ్యమానత) భారీగా తగ్గిపోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంచు ప్రభావం కారణంగా ఉదయం ఇక్కడికి చేరుకోవాల్సిన పలు విమాన సర్వీసులు ఎక్కడికక్కడ ఆలస్యమయ్యాయి. దట్టమైన పొగమంచు కారణంగా రన్‌వే స్పష్టంగా కనిపించకపోవడంతో పైలట్లు విమానాలను కిందకు దించేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఏటీసీ (ATC) అధికారుల సూచనల మేరకు.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, దిల్లీ తదితర ప్రాంతాల నుంచి గన్నవరం చేరుకున్న విమానాలు సురక్షిత ల్యాండింగ్ కోసం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. వాతావరణం కాస్త కుదుటపడి, విజిబిలిటీ మెరుగుపడిన తర్వాత ఆయా సర్వీసులను అధికారులు కిందికి దించారు. ఉదయం పూట విమానాలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు తెలిసింది.






