గన్నవరం ఎయిర్ పోర్టులో పొగమంచు.. రాకపోకలకు అంతరాయం

by Thanuru Gopichand |

ఆలస్యమవ్వడంతో ప్రయాణికుల పడిగాపులు.

గన్నవరం ఎయిర్ పోర్టులో పొగమంచు.. రాకపోకలకు అంతరాయం
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలోని (Vijayawada) గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (Gannavaram International Airport) ఆదివారం ఉదయం దట్టమైన పొగమంచు (Fog) కమ్మేసింది. పొగమంచు కారణంగా విజిబిలిటీ (Visibility) భారీగా తగ్గడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర నగరాల నుంచి రావాల్సిన విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. రన్‌వే (Runway) సరిగ్గా కనిపించకపోవడంతో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ఏటీసీ (ATC) అధికారులు అనుమతి నిరాకరించారు. దీనివల్ల కొన్ని విమానాలు గాల్లోనే చక్కర్లు కొట్టగా, మరికొన్నింటిని దారి మళ్లించాల్సి వచ్చింది. విమానాల షెడ్యూల్‌లో మార్పులు జరగడంతో ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు (Passengers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేక పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు విమానయాన సంస్థల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతే విమాన రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.

Next Story