- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మహిళల భద్రతపై దృష్టి సారించండి’.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
by Jakkula.Mamatha |
అన్నమయ్య జిల్లా(Annamayya District)లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ,వెబ్‌డెస్క్: అన్నమయ్య జిల్లా(Annamayya District)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్రంకొండ (Gurramkonda) మండల పరిధిలోని ప్యారంపల్లె (Pyarampalle)కు చెందిన ఓ యువతిపై జరిగిన యాసిడ్ దాడి ఘటనను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jagan) తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితురాలికి అండగా ఉండాలని, మెరుగైన వైద్యం అందించాలని వైఎస్ జగన్ సూచించారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం(AP Government) పై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మహిళల భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పించారు. ఇకనైనా మహిళల భద్రతపై దృష్టి సారించాలని మాజీ సీఎం జగన్ కోరారు.
Next Story






