విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 విమాన సర్వీసు ప్రారంభం

by velandi.Saikiran |   (  Updated:2026-04-10 04:54:51  IST  )

హైదరాబాద్ కు ఫ్లై 91 విమాన సర్వీస్ ప్రారంభించారు.

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 విమాన సర్వీసు ప్రారంభం
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలోని విజయవాడ నుంచి హైదరాబాద్ మహానగరానికి ప్రయాణించే వారికి అదిరిపోయే శుభవార్త అందింది. ఈ రెండు నగరాల మధ్య విమానయాన సేవలు మరింత విస్తృతం కాబోతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్ కు ఫ్లై 91 విమాన సర్వీస్ ప్రారంభించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు విమాన సర్వీసును శ్రీకాకుళం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. 2024లో ప్రారంభమైన ఫ్లై 91 సంస్థ ఉడాన్ పథకం ద్వారా క్రమ క్రమంగా ఎదుగుతోందని ప్రశంసించారు. ఇక ఈ నెల 17వ తేదీ నుంచి హైదరాబాద్ వేదికగా 22 రాకపోకలు నిర్వహించేందుకు సంస్థ ముందుకు వచ్చినట్లు స్పష్టం చేశారు. త్వరలోనే దుబాయ్, వారణాసి, కొచ్చితో పాటు ఇతర సర్వీసుల రాకపోకలకు చర్యలు చేపట్టబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నంలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పనులు జూన్ మాసం నాటికి పూర్తి అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక జూలైలో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

Next Story