- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలానికి తగ్గిన వరద ప్రవాహం
ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి గత కొన్ని రోజులుగా కొనసాగిన వరద ప్రవాహం ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది.

దిశ,వెబ్‌డెస్క్: ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి గత కొన్ని రోజులుగా కొనసాగిన వరద ప్రవాహం ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గడంతో.. జూరాల, సుంకేసుల నుంచి 1.03 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. 6 గేట్లు ఎత్తి 1.59 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
ఆరు గేట్ల ద్వారా 1,61,016 క్యూసెక్కులు, కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ ఉత్పాదన నిమిత్తం మరో 66,102 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881 అడుగులుగా ఉంది. నాగార్జునసాగర్ డ్యామ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1.54 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అటు గోదావరిపై ఉన్న మేడిగడ్డ బ్యారేజీ వద్ద 1.48 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. ఇక, వారాంతం కావడంతో శనివారం జలాశయం వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది.






