- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.

దిశ,వెబ్‌డెస్క్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టులోని ఎడమ, కుడి గట్టుల వద్ద ఉన్న విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేంద్రాల ద్వారా రోజుకు 58,750 క్యూసెక్కుల నీరు విద్యుత్ ఉత్పత్తికి వినియోగించబడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అదే నీటిని నాగార్జునసాగర్‌కు కూడా విడుదల చేస్తున్నారు. ఈ తరుణంలో ఎగువ ప్రాంతమైన జూరాల నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది.
ఈ రోజు(మంగళవారం) ఉదయం 6 గంటల సమయంలో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి సుమారు 1,00,085 క్యూసెక్కుల వరద నీరు ప్రవహించినట్టు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 874.30 అడుగులు ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలోని నీటిమట్టం 874.30 అడుగులకు చేరగా, మొత్తం నీటి నిల్వ 160.52 టీఎంసీలు గా నమోదైంది. వరద(Flood) ప్రవాహం నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండడం, దిగువకు నీటి విడుదల కొనసాగడం ప్రాజెక్టు నిర్వహణలో కీలకంగా మారింది.






