మొంథా తుపాను.. ఏపీలో నేడు పలు విమాన సర్వీసులు రద్దు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-28 03:06:18  IST  )

మొంథా తుపాను ఎఫెక్ట్ విమాన సర్వీసులపై పడింది. తుపాను కారణంగా పలు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి..

మొంథా తుపాను.. ఏపీలో నేడు పలు విమాన సర్వీసులు రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: మొంథా తుపాను ఎఫెక్ట్ విమాన సర్వీసులపై పడింది. తుపాను కారణంగా పలు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ఎయిరిండియా, ఇండిగో సర్వీసులను విమానాశ్రయ అధికారులు రద్దు చేశారు. మంగళవారం ఉదయం 10.45 వరకు నడిచే ఇండిగో విమాన సర్వీసులు, ఢిల్లీ - విజయవాడ మధ్య నడిచే ఫ్లైట్ రాకపోకలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వాతావరణం అనుకూలించకపోడంతో అక్కడి నుంచి రాకపోకలు సాగించాల్సిన అన్ని విమాన సర్వీసుల్ని రద్దు చేసినట్లు ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎన్. పురుషోత్తం ప్రకటించారు. ఢిల్లీ, భువనేశ్వర్, విజయవాడ, రాయ్ పూర్, హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లే విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులు సహకరించాలని ఎయిర్ పోర్టుల అధికారులు విజ్ఞప్తి చేశారు.

Read More..

మచిలీపట్నంకు అతి దగ్గరలో తుపాను.. రాత్రికి తీరం దాటే ఛాన్స్

Next Story