Flights Delay: పొగమంచు ఎఫెక్ట్.. విమానాల రాకపోకల్లో తీవ్ర అంతరాయం

by Kema Shiva Kumar |

పొగమంచు (Heavy Fog) కారణంగా దేశ వ్యాప్తంగా విమానాల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Flights Delay: పొగమంచు ఎఫెక్ట్.. విమానాల రాకపోకల్లో తీవ్ర అంతరాయం
X

దిశ, వెబ్‌డెస్క్: పొగమంచు (Heavy Fog) కారణంగా దేశ వ్యాప్తంగా విమానాల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇవాళ గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport)లో విమానాల ల్యాండింగ్ (Landing), టేకాఫ్ (Take Off) కష్టంగా మారినట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ (Airport Authority) అధికారులు వెల్లడించారు. అందుకు ప్రధాన కారణం దట్టమైన పొగమంచేనని అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport)కు రావాల్సిన హైదరాబాద్ (Hyderabad), బెంగుళూరు (Bengaluru), విశాఖపట్నం (Vishakhapatnam), ఢిల్లీ (Delhi) విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని తెలిపారు. మరోవైపు ఫ్లైట్స్ ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ఎయిర్‌పోర్టులోనే ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. శీతాకాలం వెళ్లేంత వరకు ముఖ్యంగా ఉదయం వేళల్లో విమానాల ల్యాండింగ్ కష్టమేనని ఎయిర్‌పోర్టు సిబ్బంది స్పష్టం చేశారు.

Next Story