Flight Services: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. విశాఖ - విజయవాడ మధ్య రెండు విమాన సర్వీసులు

by Kema Shiva Kumar |

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర పౌర విమానయాన శాఖ (Central Department of Civil Aviation) గుడ్ న్యూస్ చెప్పింది.

Flight Services: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. విశాఖ - విజయవాడ మధ్య రెండు విమాన సర్వీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర పౌర విమానయాన శాఖ (Central Department of Civil Aviation) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు విశాఖపట్నం (Vishakhapatnam) నుంచి విజయవాడ (Vijayawada)కు ఇప్పుడు ఉన్న సర్వీసులకు అదనంగా మరో రెండు విమాన సర్వీసులను ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express), ఇండిగో ఎక్స్‌ప్రెస్ (Indigo Express) సంస్థలు తమ సర్వీసులను నడుపనున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Central Department of Civil Aviation Minister Rammohan Naidu) ఆ సర్వీసులను ప్రారంభించనున్నారు.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీస్ (Air India Express Service) ఉదయం 9.35కు విశాఖపట్నం (Vishakhapatnam) నుంచి బయలుదేరి ఉదయం 4.35కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు (Gannavarm Airport)) చేరుకుంటుంది. తిరిగి అదే ఫ్లైట్ రాత్రి 7.55కు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలకు విశాఖపట్నంకు చేరుకుంటుంది. ఇక గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఇండిగో విమానం సాయంత్రం 7.15కు బయలుదేరి రాత్రి 8.20కి విశాఖపట్నం చేరుకుంటుంది. మళ్లీ అదే ఫ్లైట్ రాత్రి 8.45కు విశాఖ నుంచి బయలుదేరి రాత్రి.9.50కి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది.

Next Story