రాజమండ్రి టు తిరుపతి... విమాన సర్వీసు ప్రారంభం

by Vemula.Srinu Prasad |

రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసు ప్రారంభమైంది.

రాజమండ్రి టు తిరుపతి...  విమాన సర్వీసు ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి(Rajamundry) నుంచి తిరుపతి(Tirupati)కి విమాన సర్వీసు ప్రారంభమైంది. ఎన్నో రోజులుగా తిరుపతికి విమాన సర్వీసు(Air Service) కావాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తూ వచ్చింది. ఈ విషయం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి సైతం పలుమార్లు తీసుకెళ్లారు. దీంతో త్వరలోనే విమాన సర్వీసును ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు దేవీ నవరాత్రుల సందర్భంగా బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసును ప్రారంభించారు. ఎంపీ పురంధేశ్వరితో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇక ఈ విమాన సర్వీసులో మొత్తం 70 సీట్లు ఉన్నాయి. మొదటి 35 సీట్లకు రూ. 1999, తర్వాత 35 సీట్లకు రూ. 4000గా టికెట్ ధరను నిర్ణయించారు. అది కూడా మొదటి మూడు నెలలపాటు ఈ ధర అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఎయిర్ పోర్టు అధికారుల నిర్ణయంపై టికెట్ ధరలుంటాయి. త్వరలోనే షిర్డీ, వారణాసి, కొచ్చి తదితర ప్రాంతాలకు సైతం రాజమండ్రి నుంచి విమానాలు నడిపేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. తాజాగా తిరుపతికి కూడా విమాన సర్వీసును ప్రారంభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story