Floods Alert: అతి భారీవర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-28 09:19:37  IST  )

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన మొంథా తుపాను ప్రభావంతో.. రానున్న 24 గంటల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

Floods Alert: అతి భారీవర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన మొంథా తుపాను ప్రభావంతో.. రానున్న 24 గంటల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశాలో రేపు (బుధవారం ఉదయానికి ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది. లోతట్టుప్రాంతాల ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి, పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించింది. ప్రస్తుతం ఈ తుపాను మచిలీపట్నానికి 120, కాకినాడకు 200, విశాఖకు 290 కిలోమీటర్ల దూరంలో ఉందని, సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం - కాకినాడ మధ్యలో తీరందాటుతుందని పేర్కొంది. తీరం దాటిన తర్వాత కూడా రేపు కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ లో.. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉన్నట్లు తెలిపింది. అదేవిధంగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో.. ఒడిశాలోని గజపతి, గంజాం జిల్లాల్లో వరదలు వచ్చే ఛాన్స్ ఉందని, ఆయా జిల్లాల అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. అలాగే మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Read More.. మొంథా తుఫానుపై ఎప్పటికప్పుడు సమీక్ష : మంత్రి లోకేష్

Next Story