చిలకలూరిపేటలో రోడ్డుప్రమాదం.. ఏఎస్ఐ కుమారుడు సహా ఐదుగురు అరెస్ట్

by Vemula.Srinu Prasad |

చిలకలూరిపేటలో విద్యార్థుల మృతికి కారణమైన ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు...

చిలకలూరిపేటలో రోడ్డుప్రమాదం.. ఏఎస్ఐ కుమారుడు సహా ఐదుగురు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా చిలకలూరిపేట(Chilakaluripet)లో ఐదుగురు విద్యార్థుల మృతికి కారణమైన ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా వీరంతా రవాణాశాఖ(Transport Department) అధికారుల పేరుతో వాహనదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని విచారణలో తేలింది. ఈ క్రమంలోనే చిలకలూరిపేట మండలం గణపవరం(Ganapavaram) వద్ద ట్రాక్టర్(Tractor) లోడ్ కంటైనర్‌ను చెకింగ్ పేరుతో రోడ్డుపై నిలిపివేశారు. అయితే ఈ కంటైనర్‌ను విద్యార్థుల కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ నెల 4న ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. స్థానిక సీసీ కెమెరాలు, కొత్త టెక్నాలజీతో నిందితులను గుర్తించారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. ప్రధాని నిందితుడు ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు అక్రమాలను వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థుల మృతుల కారణమైన ఈ ఐదుగురిని అరెస్ట్ చేసిన రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story