- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కీలక పరిణామం.. ఐదుగురు నాన్-ఎస్‌సీఎస్ అధికారులకు ఐఏఎస్‌గా పదోన్నతి
రాష్ట్రానికి చెందిన ఐదుగురు నాన్-స్టేట్ సివిల్ సర్వీస్ అధికారులకు ఐఏఎస్‌గా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర సిబ్బంది, వ్యవహారాలు, పెన్షన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రానికి చెందిన ఐదుగురు నాన్-స్టేట్ సివిల్ సర్వీస్ అధికారులకు ఐఏఎస్‌గా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర సిబ్బంది, వ్యవహారాలు, పెన్షన్ల శాఖ (DoPT) ఉత్తర్వులు జారీ చేసింది. 2024 సంవత్సరానికి సంబంధించిన ఖాళీల ఆధారంగా కేంద్ర సెలెక్షన్ కమిటీ ఈ ఐదుగురు అధికారులను ఎంపిక చేసింది. అంతేకాదు వారిని ఏపీ క్యాడర్‌కే కేటాయించింది. ప్రభల గోపీనాథ్‌తో పాటు గుడిసా బాలకృష్ణ, ఎం. జయకృష్ణ, ఏ.ఏ.ఎల్. పద్మావతి, డాక్టర్ ఎం. వరప్రసాద్ పదోన్నతి పొందారు. విభిన్న శాఖల్లో నాన్-ఎస్‌సీఎస్ కేటగిరీలో సేవలు అందించారు. సీనియారిటీ ఆధారంగా సివిల్ సర్వీసెస్‌లో వీరికి భాగస్వామ్యం కల్పించింది. తదుపరి చర్యలను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐఏఎస్‌లుగా ఎంపికైన ఈ ఐదుగురు అధికారుల సీనియారిటీ నిర్ధారణ, తుది కేడర్ కేటాయింపు ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌కి పంపిన ఉత్తర్వుల్లో కేంద్రం సూచించింది.






