- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Murder mystery: ఆ వీడియోనే వారిని పట్టించింది.. హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు
వారిద్దరూ స్నేహితులు.. ఇద్దరి మధ్య బేధాభిప్రాయలు వచ్చాయి. అది చంపుకొనే వరకు వెళ్లింది.

దిశ, డైనమిక్బ్యూరో/ అనంతపురం ప్రతినిధి : వారిద్దరూ స్నేహితులు.. ఇద్దరి మధ్య బేధాభిప్రాయలు వచ్చాయి. అది చంపుకొనే వరకు వెళ్లింది. అయితే హత్య(murder) చేసే సమయంలో వీడియో తీశారు. ఆ వీడియోనే ప్రధాన సాక్ష్యంగా వారిని పట్టించింది. అప్పుడు ఆ నిందితులకు జీవిత ఖైదు పడింది. మండల కేంద్రమైన నార్పలకు చెందిన మట్టి పవన్ కుమార్ హత్య కేసులో ఐదుగురికి జీవిత కాలపు కఠిన కారాగార శిక్ష(Life imprisonment) విధిస్తూ అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ శ్రీనివాస్ సోమవారం సంచలన తీర్పు చెప్పారు. కేసు పూర్వాపరాలిలా ఉన్నాయి.. నార్పలకు చెందిన హతుడు మట్టి పవన్ కుమార్, మెదటి ముద్దాయి డిపో షాజిద్ ఒకప్పుడు మంచి స్నేహితులు. వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి తరచూ గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో డిపో షాజిద్ ను, నాల్గవ ముద్దాయి తలారి సుధాకర్ ను చంపుతానని మట్టి పవన్ కుమార్ తరచూ బెదిరించేవాడు.
అలా వారి మధ్య గొడవలు పెరిగిపోవడంతో తన తల్లిదండ్రులతోపాటు అనంతపురానికి పవన్ కుమార్ మకాం మార్చాడు. ఆ తర్వాత 2022 ఏప్రిల్ 12న పవన్ తండ్రి మట్టి శ్రీనివాసులు రేషన్ బియ్యం కోసం నార్పలకు వెళ్లాడు. అదే రోజు మధ్యాహ్నం తండ్రికి చెప్పకుండా పవన్ కుమార్ కూడా నార్పల తహసీల్దార్ ఆఫీస్ వద్దకు వెళ్లాడు. అక్కడ డిపో షాజిద్ తారసపడడంతో ఇద్దరూ ఘర్షణ పడ్డారు. మాటామాటా పెరగడంతో షాజిద్ పై పవన్ కత్తితో దాడి(Attack with a knife) చేసి గాయపరిచాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన షాజిద్ వడ్డే తిమ్మన్న తోట వద్ద పవన్ ఉన్నట్టు తెలుసుకుని రాత్రి 10.30 గంటల సమయంలో తన అనుచరులైన చింతాకు రమేష్, చిక్కేపల్లి నాగేంద్ర, తలారి సుధాకర్, తలారి అరుణ్ లతో వెళ్లి తమ వెంట తెచ్చుకొన్న స్టీల్ రాడ్, కట్టెలతో అతి దారుణంగా కొట్టారు.
అలా కొడుతున్నపుడు చిక్కేపల్లి నాగేంద్ర వీడియో(vedio) తీసి తలారి సుధాకర్ సెల్ కు ఫార్వర్డ్ చేశాడు. అందులో సుధాకర్ అంటే ఒక బ్రాండ్ అంటూ రాడ్ తో ఇష్టానుసారంగా కొట్టే దృశ్యాలు(Striking scenes) వున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. పోలీసులు నాగేంద్ర, తలారి సుధాకర్ సెల్ ఫోన్ల(cell phone)ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్(Forensic Lab) కు పంపి, అందుకు సంబంధించిన బలమైన డిజిటల్ సాక్ష్యాలను కోర్టు ముందు ప్రవేశ పెట్టారు. దీంతో ప్రత్యక్ష సాక్షులు(Eyewitnesses) సాక్ష్యం చెప్పక పోయినప్పటికీ, సెల్ ఫోన్(cell phone) లో నిక్షిప్తమైన సాక్ష్యంతో పాటు అధికారులు చెప్పిన సాక్ష్యం ఆధారంగా నేరం రుజువైనట్టు భావించి డిపో షాజిద్, చింతాకు రమేష్, చిక్కేపల్లి నాగేంద్ర, తలారి సుధాకర్, తలారి అరుణ్ లకు జీవిత కాలపు కఠిన కారాగార శిక్ష, రూ.20,000 చొప్పున జరిమానా విధిస్తూ సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్(Prosecution) తరపున రాచమల్లు హరినాథ్ రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. ఈ కేసులోని ముద్దాయిలు అందరూ 25 సంవత్సరాల లోపు యువకులే. ఒక్కరు మినహా అందరూ అవివాహితులు.






