- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఆ మూడు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు!?
రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారాయి. ఈ క్రమంలో శుక్ర, శనివారాల్లో ఏపీ(Andhra Pradesh)లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నిన్న రాత్రి వరకు కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. నిన్న(శనివారం) అల్లూరి సీతారామరాజు, నంద్యాల, ఏలూరు, కోనసీమ, అనకాపల్లి, తూర్పు గోదావరి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి.
ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం మరోసారి రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఈ నెల(జులై) 24వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో రాబోయే ఐదు రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ తరుణంలో నేడు(ఆదివారం) ఏలూరు, వైఎస్సార్ కడప, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, శ్రీ సత్య సాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక, రేపు(సోమవారం) తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా . ఈ వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల దృష్ట్యా సముద్రం అలజడిగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రేపటి(సోమవారం) నుంచి బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడుతున్న సమయంలో బయటకు, చెట్ల కిందికి వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ సూచించారు.






