Boat Accident: శ్రీకాకుళం జిల్లా కొత్తపాలెంలో బోటు ప్రమాదం.. మత్స్యకారుడు మృతి

by Ramesh Naini |

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపాలెం గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.

Boat Accident: శ్రీకాకుళం జిల్లా కొత్తపాలెంలో బోటు ప్రమాదం.. మత్స్యకారుడు మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపాలెం గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తా పడటంతో ఒక మత్స్యకారుడు మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపాలెం గ్రామానికి చెందిన కర్రి విశ్వనాథం (35) సోమవారం రాత్రి మరో 10 మంది మత్స్యకారులతో కలిసి బోటులో వేటకు వెళ్లారు. వేట సమయంలో చేపల కోసం వలను విసిరిన కొద్దిసేపటికే బోటు ఒకవైపు వాలడంతో విశ్వనాథం సముద్రంలో పడిపోయాడు.

అతడిని రక్షించేందుకు తోటి మత్స్యకారులు ప్రయత్నించినప్పటికీ, విశ్వనాథం వలలో చిక్కుకుని బోటు ఫ్యాన్ కిందకు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదం సమయంలో ఇతర మత్స్యకారులు ఈదుకుంటూ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనతో కొత్తపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు విశ్వనాథానికి భార్య ఉమామహేశ్వరి, ఇద్దరు కుమారులు ప్రసాద్, వినయ్ ఉన్నారు. కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Next Story