- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ స్కెచ్.. అడ్డంగా దొరికిపోయిన మత్య్సశాఖ అధికారి
చేపల పెంపకం రుణాల మంజూరు చేసేందుకు మత్స్యశాఖ అధికారి లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు...

దిశ, వెబ్ డెస్క్: చేపల పెంపకం(Fish farming) రుణాల మంజూరు చేసేందుకు మత్స్యశాఖ అధికారి(Fisheries Department Officer) లంచం(Bribe) డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన తిరుపతి జిల్లా(Tirupati District)లో జిరిగింది. మత్స్యశాఖలో అధికారిగా పనిచేస్తున్న నెల్లూరు రెడ్డయ్య(Nellore Reddayya) అనే వ్యక్తి, ఓ రైతుకు లబ్ధి చేకూర్చే క్రమంలో పెద్ద మొత్తంలో లంచం ఆశించి చివరకు చట్టానికి దొరికిపోయారు. బాధిత రైతుకు చేపల పెంపకం నిమిత్తం ప్రభుత్వం నుంచి రూ.50 లక్షల రుణం మంజూరైంది. అయితే ఈ రుణాన్ని సదరు రైతు ఖాతాకు బదిలీ చేసేందుకు అధికారి నెల్లూరు రెడ్డయ్య రూ.6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తొలి విడతగా రూ.3 లక్షల నగదు ఇవ్వాలని చెప్పారు.
లంచం నగదుతో పట్టుబడిన రెడ్డయ్య
దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నెల్లూరు రెడ్డయ్య లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. లంచం నగదుతో సహా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ బృందాలు తమ తనిఖీలను మరింత వేగవంతం చేశారు. కడపలోని మత్స్యశాఖ అధికారి నెల్లూరు రెడ్డయ్య నివాసంలో ఏసీబీ అధికారులు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. అక్రమ ఆస్తులు, కీలక పత్రాల స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.






