- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Andhra Pradesh:దేశంలోనే తొలిసారి.. అమరావతిలో ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా దూసుకెళ్తుంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం(AP Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిని హరిత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. దేశంలోనే తొలిసారి అమరావతిలో భారీ ఎత్తున ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగుతోంది.
ఇందులో భాగంగా అమరావతి(Amarawati)లో రోడ్ల నిర్మాణాలకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. అంటే.. అడ్డుగా ఉన్న చెట్లను ట్రీ ట్రాన్స్‌లొకేషన్(Tree translocation) పద్ధతి ద్వారా తొలగిస్తున్నారు. ఈ పద్ధతిలో చెట్ల కొమ్మలను కత్తిరించి, చుట్టూ తవ్వి కొంతమేర వేళ్లను కత్తిరిస్తున్నారు. అనంతరం వేరు వ్యవస్థ కుళ్లిపోకుండా ఫంగ్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. వేరు చుట్టూ ఉన్న మట్టి సహా చెట్టును క్రేన్ సహాయంతో తొలగించి చుట్టూ గోనె సంచి చుడుతున్నారు.
ఈ క్రమంలో ఆ చెట్లను నర్సరీకి తరలించి, పెద్ద ప్లాస్టిక్ సంచుల్లో కోకోపిట్, ఎర్రమట్టి, ఎరువులు కలిపిన మిశ్రమాన్ని నింపుతున్నారు. డ్రిప్ ద్వారా నీటి తడులు అందిస్తున్నారు. ఈ పద్ధతిలో సాధారణంగా బతికే అవకాశం 40 శాతమే ఉంటుంది. ప్రత్యేక చర్యల ద్వారా 85 శాతం వరకు నమోదైంది. ఆ చెట్లను తుళ్లూరు మండలం అనంవరంలోని ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్(Tree transplantation) సెంటరుకు తరలిస్తున్నారు. అక్కడ వేల సంఖ్యలో చెట్లను సంరక్షిస్తున్నారు. అనంతరం వాటిని రాజధానిలోని గ్రీన్ జోన్లలో నాటుతారు.






