- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం.. జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్ ను సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆవిష్కరించారు. అమరావతిలోని SRM యూనివర్సిటీ, గన్నవరంలోని మేధాటవర్స్ లో ఏర్పాటు చేసిన టెస్ట్ బెడ్స్ ను.. సీఎం జాతికి అంకితం చేశారు. ఎస్ఆర్ఎం నుంచి మేధా టవర్స్ లో ఏర్పాటు చేసిన టెస్ట్ బెడ్ ను వర్చువల్ గా ప్రారంభించారు. క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ ఉన్న తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించిందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహా.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డీఆర్డీఓ వంటి సంస్థల సహకారంతో క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ క్వాంటం మిషన్ సహా.. ఐఐటీ ప్రొఫెసర్లు, క్వాంటం రంగంలో పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులు, క్వాంటం ఇన్నోవేషన్ స్టార్టప్స్ ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు, నిపుణులు హాజరయ్యారు. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని 1.5 లక్షల మందికిపైగా విద్యార్థులు చూసేలా ఏర్పాట్లు చేశారు.






