GBS Death : ఏపీలో GBS తొలి మరణం

by M.Rajitha |
GBS Death : ఏపీలో GBS తొలి మరణం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో గులియన్ బార్ సిండ్రోమ్(GBS) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆదివారం ఏపీలో తొలి జీబీఎస్ మరణం(GBS Death) నమోదయింది. ప్రకాశం జిల్లా(Prakasham District) అలసందలపల్లికి చెందిన మహిళ గుంటూరు జీజీహెచ్(Guntur GGH) లో చికిత్స పొందుతూ మృతి చెందింది. జీబీఎస్ బారిన పడిన కమలమ్మ అనే మహిళ కొద్దిరోజుల క్రితం ఆసుపత్రిలో చేరగా.. కాళ్ళు చచ్చుపడిపోయి వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం మరణించింది. జీజీహెచ్ సూపరిండెంట్ యశస్వి మహిళ మరణాన్ని జీబీఎస్ మరణంగా ధ్రువీకరించారు. కాగా ఇదే ఆసుపత్రిలో మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 17 మంది వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జీబీఎస్ చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇది అంటువ్యాధి కాకపోయినా.. కలుషిత ఆహారం, నీటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, రాష్ట్రంలో ఎవరైనా గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలతో బాధపడినా వెంటనే ఆస్పత్రులకు వెళ్లి రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలియ జేశారు. వ్యాధి సోకినా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని.. కాకపోతే వెంటనే ఆసుపత్రిలో చేరితే చికిత్సతో త్వరగా కోలుకోవచ్చని పేర్కొంటున్నారు.

వ్యాధి లక్షణాలు ఇవే..

గులియన్-బారే సిండ్రోమ్(GBS) అనేది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. కండరాల బలహీనత లేదా పక్షవాతం వంటి లక్షణాలు ఉంటాయి. ఇది బలహీనత, పక్షవాతం లేదా నొప్పిని కలిగిస్తుంది. బాధితులకు ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్స్(IVIG) ఇంజెక్షన్లు లేదా ప్లాస్మా మార్పిడితో చికిత్స అందిస్తారు.

Advertisement
Next Story