ప్రైవేటు బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ముప్పు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-17 04:10:20  IST  )

ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రైవేటు బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ముప్పు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రైవేట్ బస్సు డ్రైవర్ అప్రమత్తతో పెద్ద ముప్పు తప్పింది. బస్సులో మంటలు చెలరేగి దగ్ధమవ్వగా, అందులోని ప్రయాణికులు సురక్షింగా బయటపడిన సంఘటన కర్నూలు (Kurnool) జిల్లా పరిధిలోని పత్తికొండ (Pattikonda) సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కర్నాటకకు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travels Bus) మంత్రాలయం నుంచి బెంగళూరుకు ప్రయాణమైంది. పత్తికొండ సమీపానికి చేరుకునే క్రమంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అది గమనించి బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికులను అలర్ట్ చేశారు. వారు వెంటనే బస్సులో నుంచి కిందకు దిగారు. చూస్తుండగానే మంటలు బస్ అంతటా వ్యాపించాయి. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అగ్నిమాపక శాఖకు అందివ్వడంతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తరచూ చోటు చేసుకుంటున్న బస్సు ప్రమాదాలు ప్రయాణికుల్లో ఆందోళనను పెంచుతున్నాయి.

Read More..

APSRTCకి అరుదైన ఘనత.. మరో ప్రతిష్టాత్మక అవార్డు సొంతం

Next Story