APSRTCకి అరుదైన ఘనత.. మరో ప్రతిష్టాత్మక అవార్డు సొంతం

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-17 04:12:56  IST  )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

APSRTCకి అరుదైన ఘనత.. మరో ప్రతిష్టాత్మక అవార్డు సొంతం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. రవాణా రంగంలో ఆధునిక సాంకేతికతను జోడించి, ప్రయాణికులకు మెరుగైన డిజిటల్ సేవలు అందిస్తున్నందుకు గాను ‘గవర్నెన్స్‌ నౌ - 6వ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌ సమ్మిట్‌’ అవార్డుకు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎంపికైంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో డిజిటల్ మార్పుల ద్వారా విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్న సంస్థలను గుర్తించి ‘గవర్నెన్స్ నౌ’ ఈ అవార్డులను అందజేస్తుంది.

కాగా, కండక్టర్ల వద్ద ఈ-పోస్ (e-POS) మెషీన్ల ద్వారా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం, ఫోన్ పే (Phone Pe), గూగుల్ పే (Google Pay) వంటి డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రయాణికులు తమ బస్సు ఎక్కడ ఉందో మొబైల్ ద్వారా తెలుసుకునేలా ‘ప్రథమ్’ (Pratham) వంటి యాప్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక పార్శిల్, కొరియర్ సేవల్లో పారదర్శకత కోసం ఆన్‌లైన్ బుకింగ్, ట్రాకింగ్ సదుపాయం కల్పించడం, సంస్థ అంతర్గత వ్యవహారాల్లో కంప్యూటరీకరణను పెంచి, పనితీరులో వేగాన్ని తీసుకురావడం వంటి అంశాలు అవార్డు రావడానికి దోహదపడ్డాయి. మరోవైపు ఏపీఎస్ ఆర్టీసీ ‘6వ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌ సమ్మిట్‌’ అవార్డుకు ఎంపికవ్వడం పట్ల సీఎం చంద్రబాబు, ఆర్టీసీ ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు.

Read More..

నేడు కాకినాడలో సీఎం.. డిప్యూటీ సీఎం పర్యటన

Next Story