పూరీ - తిరుపతి రైలులో అగ్నిప్రమాదం.. ఆందోళనలో ప్రయాణికులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-08 05:05:48  IST  )

ఇటీవల కాలంలో తరచూ రైళ్లలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 10 రోజుల క్రితం ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ లోని ఏసీ బోగీలో మంటలు చెలరేగడంతో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

పూరీ - తిరుపతి రైలులో అగ్నిప్రమాదం.. ఆందోళనలో ప్రయాణికులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో తరచూ రైళ్లలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 10 రోజుల క్రితం ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ లోని ఏసీ బోగీలో మంటలు చెలరేగడంతో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. తాజాగా పూరీ - తిరుపతి రైలులో మంటలు చెలరేగాయి. తుని - అన్నవరం మధ్య గురువారం ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బోగీలో విద్యుత్ ప్యానల్ బోర్డు వద్ద దుప్పట్లకు మంటలు అంటుకోవడం ప్రమాదానికి దారితీసింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది.. మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. కాగా.. రైలులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే సిబ్బంది తెలిపారు. ప్రమాదానికి గురైన బోగీని రైల్వే అధికారులు రాజమండ్రి రైల్వే స్టేషన్లో పరిశీలించారు.

Read More..

రాయదుర్గంలో తప్పిన రైలు ప్రమాదం.. గూడ్స్ రైలు నుంచి విడిపోయిన బోగీలు

Next Story