- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయదుర్గంలో తప్పిన రైలు ప్రమాదం.. గూడ్స్ రైలు నుంచి విడిపోయిన బోగీలు
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం ఉదయం గూడ్స్ రైలు ప్రమాదం తప్పింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం ఉదయం గూడ్స్ రైలు ప్రమాదం తప్పింది. ఇనుప ఖనిజం లోడ్‌తో కర్ణాటకలోని మంగళూరుకు వెళ్తున్న రన్నింగ్ గూడ్స్ రైలు నుంచి కొన్ని బోగీలు విడిపోయాయి. మొలకలమూరు నుంచి కర్ణాటక విజయగనరం జిల్లా తోరణగల్లులోని జిందాల్ ఫ్యాక్టరీకి వెళ్తున్న ఈ గూడ్స్ రైలులో 4వ వ్యాగన్ వద్ద బోగీ లింక్ కట్ కావడంతో ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయాయి.
ఈ ఘటన అనంతపురం-రాయదుర్గం రైల్వే మార్గంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదం కారణంగా ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరలేదని తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైల్వే ట్రాఫిక్‌ను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం.
Read More..






