- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Janasena party office:జనసేన పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం
by Jakkula.Mamatha |
జనసేన పార్టీ(Janasena Party)కి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ రోజు(శుక్రవారం)ఉదయం జనసేన పార్టీ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ,వెబ్‌డెస్క్: జనసేన పార్టీ(Janasena Party)కి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ రోజు(శుక్రవారం)ఉదయం జనసేన పార్టీ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖలోని గోపాలపట్నం ఇంద్రనగర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా కాపాడారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జనసేన పార్టీ ఆఫీస్‌లో అగ్నిప్రమాదంకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






