BREAKING: ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-28 23:31:08  IST  )

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వేస్టేషన్ సమీపంలో ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ రైలు..

BREAKING: ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వేస్టేషన్ సమీపంలో ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ రైలు (18189) అగ్నిప్రమాదానికి గురైంది. అర్థరాత్రి దాటిన తర్వాత సుమారు 1.30 గంటల సమయంలో ప్యాంట్రీకారును ఆనుకుని ఉన్న ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. లోకో పైలట్ అప్రమత్తమై.. రైలును ఎలమంచిలి రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. B1బోగీలో మంటలు చెలరేగగా.. అవి క్రమంగా.. పక్క బోగీ M2కి కూడా వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు ప్రాణభయంతో బోగీల నుంచి బయటకు పరుగులు తీశారు. రైలును ఎలమంచిలి స్టేషన్లో ఆపిన తర్వాత మిగతా కోచ్ లను అగ్నిప్రమాదం జరిగిన కోచ్ ల నుంచి సిబ్బంది వేరు చేశారు. స్టేషన్ కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ రైలు అనకాపల్లికి 4 గంటలు ఆలస్యంగా చేరుకుంది. నర్సింగబల్లికి బయల్దేరిన కాసేపటికే B1 ఏసీ బోగీ బ్రేకులు పట్టేయడంతో అగ్నికీలలు వ్యాపించినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story