- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదోనిలోని మరో జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోనిలోని (Adoni) మరో జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం (Fire Accident In Jinning Mill) చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లా ఆదోనిలోని (Adoni) మరో జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం (Fire Accident In Jinning Mill) చోటు చేసుకుంది. ఎన్డీబీఎల్ జిన్నింగ్ మిల్లులో ఈ అగ్ని ప్రమాద ఘటన జరిగింది. ఒక్కసారిగా మంటలంటుకొని మిల్ అంతటా వ్యాపించాయి. మంటలు వ్యాప్తితో మిల్లులోని పత్తికి కూడా నిప్పు అంటుకుంది. దీంతో కార్మికులు దిక్కు తోచని పరిస్థితులకు వెళ్లిపోయారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం కనిపించలేదు. అగ్ని ప్రమాద ఘటనపై అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రారంభించింది. మంటలు వ్యాప్తి చెందకుండా తొలుత చర్యలు తీసుకొని, ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతోంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 9 అగ్నిప్రమాదం
ర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ జిన్నింగ్ పరిశ్రమలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణంలోని బసాపురం రహదారిలో ఉన్న హరి కాటన్ జిన్నింగ్ పరిశ్రమలో మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఈ మంటలు ఎగసిపడి అందులోనే ఉన్న సద్గురు సాయి జిన్నింగ్ పరిశ్రమకు చెందిన పత్తి నిల్వలు కూడా దగ్ధమయ్యాయని పేర్కొన్నారు. పత్తి పరిశ్రమలో మధ్యాహ్నం సమయంలో పత్తిని జిన్నింగ్ చేస్తుండగా ఒక్కసారిగా నిప్పురవ్వలు రేగాయని.. ఆ నిప్పు రవ్వలు పత్తిపై ఎగసిపడటంతో మంటలు వ్యాపించాయని తెలిపారు. కార్మికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదని.. దీంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయని నిర్వాహకులు తెలిపారు. ప్రమాదంలో సుమారు రూ.2 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు యాజమాన్యం వెల్లడించింది. గత జనవరిలో కూడా ఆదోని పట్టణంలోని సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ.8.8 కోట్ల విలువ చేసే పత్తి, పత్తి బేళ్లు, పత్తి గింజలు అగ్ని ఆహుతైనట్లు యాజమాన్యం పేర్కొంది.
Read More... గద్వాల జిల్లాలో విషాదం.. ఫ్రిజ్ పేలి తల్లి, కొడుకు మృతి






