- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గద్వాల జిల్లాలో విషాదం.. ఫ్రిజ్ పేలి తల్లి, కొడుకు మృతి
గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో ఈ నెల 6వ తేదీన ఫ్రిజ్ పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారికి తీవ్రగాయాలు అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో ఈ నెల 6వ తేదీన ఫ్రిజ్ పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారికి తీవ్రగాయాలు అయ్యాయి. కాగా వారిలో చికిత్స పొందుతూ తల్లి, 11నెలల చిన్నారి కన్నుమూశారు. మరో మహిళకు చికిత్స కొనసాగుతోంది. కాగా ఈ నెల 6వ తేదీన ధరూర్ మండల కేంద్రంలో మూసి ఉన్న షాపు నుండి పొగలు రావడంతో గమనించిన అశ్విని, సునీత అనే మహిళలు షాపు షెటర్ తెరిచారు. ఒక్కసారిగా ఫ్రిజ్ పేలడంతో ఇద్దరు మహిళలతో పాటు వారితో ఉన్న 11నెలల బాబు తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే స్థానికులు గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ నుండి మెరుగైన చికిత్స కోసం కర్నూల్ తరలించారు. ఫ్రిజ్ లో ఉండే కంప్రెసర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇక తల్లి, చిన్నారి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఫ్రిజ్ ను గోడకు 20 సెంమీ దూరంలో పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా సరైన వెంటిలేషన్ ఉండటం, ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం లాంటివి చేస్తూ ఉండాలని చెబుతున్నారు. వైరింగ్, ప్లగ్స్ సైతం సరిగా చూసుకోవాలని సూచిస్తున్నారు.
Read More... అదోనిలోని మరో జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం






