Breaking: విశాఖ డెయిరీలో అగ్నిప్రమాదం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-16 13:35:09  IST  )

విశాఖ డెయిరీలో అగ్నిప్రమాదం జరిగింది..

Breaking: విశాఖ డెయిరీలో అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ డెయిరీ(Visakha Dairy)లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టెరిలైజ్ట్ ఫ్లవర్ మిల్క్(Sterilized Flower Milk) విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఫైర్ సిబ్బందికి డెయిరీ ఉద్యోగులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికురాలికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రురాలని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని గాజువాక పోలీసులు పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై ఆరా తీశారు. షార్ట్ సర్య్కూట్ కారణం కావొచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని డెయిరీ వద్ద కార్మిక సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. అలాగే ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Next Story