జీజీహెచ్‌లో అగ్నిప్రమాదం... గర్భిణులు, బాలింతలు ఉక్కిరిబిక్కిరి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-01 14:33:22  IST  )

నెల్లూరు జీజీహెచ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గర్భిణులు, బాలింతలు వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలముకోవడంతో రోగులు, పిల్లలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ...

జీజీహెచ్‌లో అగ్నిప్రమాదం...  గర్భిణులు, బాలింతలు ఉక్కిరిబిక్కిరి
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జీజీహెచ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గర్భిణులు, బాలింతలు వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలముకోవడంతో రోగులు, పిల్లలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. దీంతో వాళ్లంతా భయంతో వణికిపోయారు. వెంటనే ఆస్పత్రి బయటకు పరుగులు తీశారు. ఇదే సమయంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో ఆస్పత్రిలో రోగులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. కొంతమంది ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఫైర్, పోలీసు సిబ్బంది ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. సహాయ చర్యలు అందిస్తున్నారు. రోగులను సురక్షితంగా పోలీసులు బయటకు తీసుకువస్తున్నారు. ఫైర్ సిబ్బంది మంటలార్పుతోంది. ఈ పరిస్థితులతో ఆస్పత్రి వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది.

Next Story